పథకం ప్రకారమే చంద్రబాబు పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నారని సీఎం జగన్ ఆరోపించారు.ఒకటో తేదీన సూర్యుడు ఉదయించముందే వాలంటీర్లు వచ్చి పెన్షన్లు అందించేవారని, అవ్వాతాతలను బాధపెడుతున్న చంద్రబాబు మనిషా.. లేదా శాడిస్టా అని విమర్శించారు. ‘ప్రతి నెలా ఒకటో తేదినే.. సూర్యుడు ఉదయించకముందే వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేవారు.
నిమ్మగడ్డతో కుట్రలు చేయించి పింఛన్ల పంపిణీని అడ్డుకున్నారు. చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో దాచి జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది’ అని ఆయన పేర్కొన్నారు.ఇవాళ ఆయన పూతలపట్టు బహిరంగ సభలో మాట్లాడుతూ, చంద్రబాబులాంటి వ్యక్తికి ఓటు వేయడం ధర్మమేనా? అంటూ ప్రశ్నించారు.పథకం ప్రకారం ఈసీకి తన మనిషి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారు. జగన్ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు.. ప్రతి పథకం మీ ఇంటికే వస్తుంది అని హామీ ఇచ్చారు.