ఈ మధ్య అధికారంలోకి వచ్చేస్తామనే భ్రమల్లో చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తున్నారు. అసలు జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇక రాబోయేది టీడీపీఏ ప్రభుత్వమే అని బాబు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఎప్పుడు చూసిన ఇదే మాటలు చెబుతున్నారు. తాజాగా కూడా గ్రామ స్థాయి నేతలతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవి టీడీపీకి ఏకపక్షంగా ఉంటాయని, ఎదురేలేకుండా దూసుకుపోతుందని, జగన్ అసమర్థ, అధ్వాన పాలనతో వైసీపీ ఆట ముగిసిపోయింది. ప్రజలు తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ఉన్నారని, మహానాడుకు పోటీగా వైసీపీ పార్టీ మంత్రుల బస్సు యాత్ర పెడితే అది తుస్సుమందని బాబు చెప్పుకొచ్చారు.
అయితే ఇక్కడ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే…కానీ అది అధికారమే మారిపోయేంత వ్యతిరేకత మాత్రం కాదని చెప్పాలి. అలా అని టీడీపీ అధికారం సాధించే బలం పెంచుకోలేదు. అలాంటప్పుడు బాబు మాత్రం బాగా కాన్ఫిడెన్స్ తో నెక్స్ట్ తాము అధికారంలోకి వచ్చేస్తున్నామని చెబుతున్నారు. బాబు ఇలా చెప్పడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. ఢీలా పడిపోయిన కార్యకర్తలని యాక్టివ్ చేయడానికి బాబు ఇలాంటి మాటలు చెబుతూ ఉండొచ్చు.
కానీ ఎంత చెప్పిన…మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో నెక్స్ట్ ఎన్నికలు ఏకపక్షంగా ఉంటాయని చెప్పడం మాత్రం జనం నమ్మడం లేదు..ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నాయో అర్ధమవుతున్నాయో..పూర్తిగా వైసీపీపై వ్యతిరేకత రాలేదు..అలాగే పూర్తిగా టీడీపీకి అనుకూలంగా పరిస్తితి లేదు. అలాంటప్పుడు వైసీపీ పని అయిపోయిందని, టీడీపీ అధికారంలోకి వస్తుంద్నై చెప్పడం అనేది బాబు భ్రమే అని చెప్పొచ్చు.
ప్రజలు ఇప్పుడే ఎవరి వైపు ఉంటారనేది తెలియదనే చెప్పాలి…ఎన్నికలు వచ్చే వరకు ప్రజలు ఎటు వైపు ఉన్నారనేది అర్ధం కాదు. కాబట్టి బాబు ఇప్పుడు వార్ వన్ సైడ్ అవుతుందని చెప్పడం పెద్ద భ్రమ అని చెప్పొచ్చు.