చంద్రబాబుకు మహిళా కమిషన్ సమన్లు…విచారణకు హాజరు కావాలని ఆదేశం

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు బోండా ఉమకు ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హజరు కావాాలని ఆదేశించింది.  విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల అత్యాచారం గురైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధిత యువతిని పరామర్శించేందుకు వచ్చిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై అనుచితంగా వ్యవహరించారనే ఆరోపనలు వచ్చాయి. పరామర్శించే సమయంలో వాసిరెడ్డి పద్మకు చంద్రబాబు, బోండా ఉమకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చనే దానిపై మహిళా కమిషన్ దృష్టి సారించింది. అత్యాచార బాధితురాలి ఆవేదను వినకుండా చంద్రబాబు నాయుడు, బోండా ఉమ అగౌరపరిచినట్లు వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. చంద్రబాబు, బోండా ఉమ ఇద్దరు వాసిరెడ్డి పద్మపై వ్యక్తిగత విమర్శలు చేసినట్లు సమన్లలో ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు, బోండా ఉమ ఇద్దరు వ్యక్తిగతంగా మహిళా కమిషన్ ముందు విచారణకు రావాలని సమన్లలో ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version