ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే మళ్లీ ఎన్నికలు వస్తాయా ? ఆ ఛాన్స్ ఉందనే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్‌కు సవాల్ విసరడంతో పాటు 48 గంటల్లో తన నిర్ణయంపై స్పందించాలని చెప్పారు. తమ ఎమ్మెల్యేలు మాత్రమే పదవులకు రాజీనామా చేయడం కాదని.. మొత్తం అసెంబ్లీనే రద్దు చేసి ఎన్నికలకు వెళదామని… ప్రజాతీర్పు జగన్‌కు అనుకూలంగా వస్తే తాము ప్రజా తీర్పును అనుసరించి.. జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని అంగీకరిస్తామని చెప్పారు. తన బాధంతా ప్రజలు, పిల్లల భవిష్యత్తు కోసమే అని చెప్పిన చంద్రబాబు మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న కుతూహలంతో ఉన్నారని అర్థమవుతోంది.
అమరావతి ఉద్యమంలో నిన్న మొన్నటి వరకు టీడీపీకి కలిసి వచ్చిన బీజేపీ దాదాపు పక్కకు తప్పుకున్నట్టే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతికే తమ మద్దతు అని చెపుతున్నా ఆయన చివరి వరకు కలిసి వస్తారా ? అన్నది సందేహమే. జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశాక చంద్రబాబు అమరావతి కేంద్రంగా కొత్త ఉద్యమ డ్రామాను రక్తి కట్టించాలని చూసినా అవన్నీ విఫల ప్రయత్నాలే అయ్యాయి. చివరకు ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవదని చెప్పడంతో చంద్రబాబు కేంద్రంతో అయినా రాజధాని తరలింపు ఆపించాలని చేసిన ఆఖరి అస్త్రం కూడా ప్లాప్ అయ్యింది.
ఇక చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలని ముందుగా నిర్ణయించారు. అయితే ఈ విషయంలో బాబుతో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎంత వరకు కలిసి వస్తారో ? కూడా తెలియని పరిస్థితి. ఇక చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకపోవడంతో చివరకు జగన్‌కు సవాల్ విసిరారు. అందుకే అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేయడం వెనక ఇదే కారణంగా కనిపిస్తోంది. ఒక వేళ జగన్ చంద్రబాబు సవాల్‌ను తీసుకున్నా అసెంబ్లీని రద్దు చేసే ఛాన్స్ లేదు. అయితే నిజంగానే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే చంద్రబాబు ఇప్పుడున్న సీట్లు కూడా నిలబెట్టుకోలేకపోతే ఆయన పరువు మరింత పోవడంతో పాటు ఆయన రాజకీయ భవిష్యత్తుకు సమాధే అవుతుంది.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పదే పదే ఉప ఎన్నికల సెంటిమెంట్‌కు వెళ్లినట్టుగా ఇక్కడ కూడా రాజధాని సెంటిమెంట్‌ను వాడుకోవాలని
చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉప ఎన్నిక రిస్క్ చేస్తే వారి భవిష్యత్తు కూడా పాతాళంలోకి వెళ్లడమే తరువాయి.