2019 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు..బీజేపీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. మోడీ, అమిత్ షాలకు దగ్గరైతే తనకు రాజకీయంగా తిరుగుండదని బాబు భావిస్తున్నారు. కానీ బాబు ఎంత ప్రయత్నించిన ఉపయోగం లేకుండా పోతుంది. బాబుని బీజేపీ అసలు దగ్గరకు రానివ్వడం లేదు. కానీ బద్వేలు ఉపఎన్నిక రూపంలో బాబుకు మంచి ఛాన్స్ వచ్చింది. బీజేపీకి దగ్గరయ్యేందుకు బాగానే ట్రై చేశారు.
అంతకముందే ఢిల్లీకి వెళ్ళి మోడీ, అమిత్ షాలని కలవాలని అనుకున్న బాబుకు అపాయింట్‌మెంట్లు దొరకక నిరాశతో వెనక్కి తిరిగొచ్చేశారు. కానీ అమిత్ షా… బాబుకు ఫోన్ చేయడంతో పరిస్తితి మారింది. సరిగ్గా బద్వేలు ఉపఎన్నిక ముందే షా, బాబుకు ఫోన్ చేశారు. దీంతో బద్వేలు ఉపఎన్నికలో పోటీ చేయని టీడీపీ, పరోక్షంగా బీజేపీకి సహకరించింది. దీంతో బద్వేలు పోరులో బీజేపీ ఓడిపోయినా సరే 21 వేల ఓట్లు తెచ్చుకుంది. 2019 ఎన్నికల్లో అయితే బీజేపీకి 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు 21 వేల ఓట్లు వచ్చాయంటే టీడీపీ సపోర్ట్ ఉండటం వల్లే అని అంతా అనుకుంటున్నారు.
ఇలా సపోర్ట్ ఇవ్వడంతో బీజేపీ… బాబుని దగ్గర తీసుకుంటుందని ప్రచారం మొదలైంది. కానీ ఈలోపే బీజేపీ ఏపీ సహ ఇన్‌చార్జి సునీల్ దేవ్‌ధర్…bబాబుకు భారీ షాక్ ఇచ్చేశారు. టీడీపీ ఒక అవినీతి పార్టీ అని, చంద్రబాబుని సొంత పార్టీ వాళ్లే నమ్మడం లేదని, టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
పైగా బద్వేలులో తాము సొంతంగా ఓట్లు తెచ్చుకున్నామని, టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయని మాట్లాడారు. అంటే ఉపఎన్నిక ముందు వరకు సైలెంట్‌గా ఉండి..ఎన్నిక అవ్వగానే బీజేపీ మాత్రం బాబుకు భలే దెబ్బవేసేసింది. మొత్తానికి చూసుకుంటే బాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ రెడీగా ఉన్నట్లు కనిపించడం లేదు…బీజేపీ దాదాపుగా గేట్లు క్లోజ్ చేసినట్లే అని చెప్పొచ్చు.