ఎంతో గట్టిగా చెప్పారు చంద్రబాబు.. ప్రభుత్వానికి 48గంటల డెడ్ లైన్ విధించారు. అమరావతి రైతులు హ్యాపీ ఫీలయ్యారు.. బాబు విల్ బి బ్య్యాక్ అంటూ తమ్ముళ్లు కలలు కన్నారు.. అమరావతి కోసం బాబు అద్భుతమైన, చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకుంటారని భావించారు! ప్రజలు, తమ్ముళ్లు, రాజధాని రైతులు అలా ఎదో భ్రమించిఉండోచ్చు కానీ… జర్నలిస్ట్ సర్కిల్ లో మాత్రం ఏమీ జరగదని చర్చలు నడిచాయి! “మనలోకం.కాం” కూడా బుదవారం ఉదయమే ఈ అంశంపై క్లారిటీ ఇచ్చే ప్రయ్యత్నం చేసింది. చివరికి అదే జరిగింది… సర్రున దూసుకెళ్తాది అనుకున్న చంద్రబాబు సిసింద్రీ చీదేసింది!
అవును… ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు 48గంటల గడువు ఇవ్వడమనేదే పెద్ద జోక్! జగన్ స్పందించరు అని తెలుసు.. స్పందించకపోయినా బాబు చేసేది ఏమీ లేదనీ తెలుసు! అయినా కూడా మరోసారి అమరావతి రైతులను మభ్యపెట్టడానికి… 48గంటల గడువు విధించారు చంద్రబాబు! బుధవారం సాయంత్రం ఐదుగంటలకు ఏదో జరుగుతుందని కొందరు భావించారు. కానీ… యదావిదిగా బాబు… జగన్ పై రాజకీయ విమర్శలు చేసి సైలంట్ అయిపోయారు. భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు.
అంటే… ప్రస్తుతానికి రాజినామాల టాపిక్ లేదు. చేసే ఉద్దేశ్యం కూడా లేదు. అలా అని సిన్సియర్ గా పోరాడటమూ లేదు. అమరావతీ జేఏసీ వెనకాల నుంచోవడం తప్పించి! ఇక్కడ మరో విషయం ఏమిటంటే… రెండు రోజులకొకసారి మీడియా సమావేశం ఏర్పాటుచేసి… ప్రజలను ఉత్సాహపరుస్తారంట చంద్రబాబు!
రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్రం పదే పదే చెబుతున్నా కూడా… రామమందిర నిర్మాణానికి పవిత్ర జలాలతో శంకుస్థాపన చేసిన ప్రధాని, అదే హోదాలో అమరావతికి కూడా పవిత్ర జలాలతో శంకుస్థాపన చేశారని, మరి దీని సంగతి పట్టించుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా అని ప్రశ్నించారు. దీంతో… తన రాజకీయ లాభం కోసం బీజేపీని ఇందులో ఇరికించే ప్రయత్నం చేశారు చంద్రబాబు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఏది ఏమైనా… బాబు అత్యంత ఘనంగా ప్రకటించిన 48గంటల డెడ్ లైన్ “తుస్” అంది. తమ్ముళ్లలో నిరాస కమ్ముకుంది. రాజధాని రైతుల్లో “మరోసారి మోసపోయాం” అనే భావన కనిపిస్తోంది! మరి బాబు త్వరలో ప్రకటించబోయే “భవిష్యత్ కార్యచరణ” ఏమిటో అన్నది వేచి చూడటం తప్పించి… ప్రస్తుతానికి బాబు నుంచి ఏమీ ఆశించలేరని చెబుతున్నారు విశ్లేషకులు!