ఆనాడు పార్లమెంటు మొత్తం అమరావతికి అండగా ఉంటుందన్నారు : చంద్రబాబు

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తనకు లేని అధికారాన్ని ఆపాదించుకుని రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు చంద్రబాబు. చేసే విధ్వంసాలను సరిదిద్దడం రాజ్యాంగ సంస్థలకు సైతం కష్టంగా మారిందని పేర్కొన్నారు చంద్రబాబు. రాష్ట్ర రాజధానిపై నిన్న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని చంద్రబాబు వెల్లడించారు. రాజధానిపై శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించిందని తెలిపారు. శివరామకృష్ణ కమిటీ తన నివేదికను అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిందని, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసిందని వివరించారు చంద్రబాబు.

అంతేకాకుండా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఆమోదించామని కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టం చేసిందని వెల్లడించారు. “ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం తీసుకువచ్చిందని, రాష్ట్రం తమను సంప్రదించకుండానే ఈ చట్టం తీసుకువచ్చిందని కేంద్రం వెల్లడించింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ విషయాలు చెప్పింది” అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news