కైకాల, చలపతిరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు

-

సినీ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖర్ రెడ్డిలతో కలసి కైకాల సత్యనారాయణ, చలపతిరావు ఇండ్లకు వెళ్లి పరామర్శించారు. చంద్రబాబు ఈ సాయంత్రం హైదరాబాదులో కైకాల నివాసానికి వెళ్లారు. ఆ నవరస నటనా సార్వభౌముడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

నటుడు కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ | TDP Chief  Chandrababu Naidu Extends condolences to family of the legendary actor  Kaikala Satyanarayana who passed away recently

కైకాల సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పనిచేసినప్పటి నుంచి తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కైకాల కుటుంబ సభ్యులకు తనతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులంతా అండగా ఉంటామని అన్నారు. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన చంద్రబాబు ఇవాళ ప్రత్యేకంగా ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అటు, ఇటీవల మృతి చెందిన మరో సీనియర్ నటుడు చలపతిరావు కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు పరామర్శించారు. చలపతిరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. చలపతిరావు కుమారుడు రవిబాబుతో మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news