మెగ్రేన్ అనేది ప్రమాదకరమైన వ్యాధి.. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ..ప్రాణం తీసేస్తుందేమో అన్నంత నొప్పిపెడుతుంది. తలలో ఒక సైడ్ మాత్రమే సుత్తితో కొట్టినట్లు బాధిస్తుంది. ఆ బాధ భరించేవారికే తెలుస్తుంది. ఇది రావడానికి కారణాలు చాలా ఉంటాయి. ఒత్తిడి కావొచ్చు, డిప్రషన్ కావొచ్చు.. వారసత్వంగా కూడా రావొచ్చు. ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణం అవుతాయి. విటమిన్ B2, మెలటోనిన్ వంటి పోషకాలు మైగ్రేన్ దాడులను నివారించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయంటున్నారు నిపుణులు… ఏయే విటమిన్లు, ఖనిజాలు మైగ్రేన్ నుండి ఉపశమనాన్ని అందిస్తాయో ఈరోజు చూద్దాం..
విటమిన్ B2..
విటమిన్ B2 శరీరంలోని అనేక జీవక్రియ ప్రక్రియలకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ విటమిన్ నీటిలో కరిగేది. మైగ్రేన్ అభివృద్ధిని నివారించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. విటమిన్ B2 కణాలకు శక్తిని అందిస్తుంది. తరచుగా మెదడు నరాలు నిస్తేజంగా మారుతాయి, ఇది పార్శ్వపు నొప్పికి దారితీస్తుంది.
మెగ్నీషియం..
నరాల పనితీరు, రక్తపోటు, కండరాల పనితీరులో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం లోపం వల్ల తలనొప్పి , మైగ్రేన్‌లు వస్తాయి.. మెగ్నీషియం సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
విటమిన్ డి..
ఇక అన్నింటికంటే ముఖ్యమైనది.. విటమిన్ డీ.. శరీరంలో విటమిన్ డి లేకపోవడం కూడా మైగ్రేన్ దాడికి దారి తీస్తుంది. విటమిన్ డి మెదడులో మంటతో పోరాడుతుంది. అదనంగా, విటమిన్ డి మెగ్నీషియం శోషణను పెంచుతుంది. మైగ్రేన్ దాడుల సమయంలో వృద్ధి కారకాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. విటమిన్ డి ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మైగ్రేన్‌ను నివారించవచ్చు.
వీటని తినే ఆహారం ద్వారానే పొందవచ్చు. ఏ ఏ ఆహారాల్లో మెగ్నీషియ, విటమిన్ డీ, విటమిన్ b2 ఉంటుందో అవి తీసుకోవడం ప్రారంభిస్తే నొప్పి నుంచి బయటపడొచ్చు.. ఎందులో ఇవి ఉంటాయో సోషల్ మీడియా. ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సైట్‌లో ఇంతకుముందే వీటిపై సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నొప్పితో బాధపడే వాళ్లు టాబ్లెట్స్ బదులు..తినే ఆహారంపై శ్రద్ధపెడితే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.