మునుగోడు ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలనినా విజ్ఞప్తి : ఈటల

-

నల్లగొండ జిల్లాలోని మునుగోడు బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. హుజురాబాద్ లో నన్ను ఓడించడానికి చేసిన ప్రయత్నమే మునుగొడులో మరోసారి చేస్తున్నారు అన్నారు. అన్ని మంచి పనులు చేస్తే, నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే ఇంత మంది ఎందుకు ప్రచారానికి వస్తున్నారని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు ఈటల రాజేందర్‌. హుజురాబాద్ లో ఇచ్చిన తీర్పు మునుగోడులో కూడా ఇవ్వాలని నా విజ్ఞప్తి అని, మునుగోడు ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలనినా విజ్ఞప్తి అని, ప్రపంచం మొత్తం మునుగోడు వైపు చూస్తుందన్నారు ఈటల రాజేందర్‌.

Telangana: BJP officially declares Eatala Rajender as its candidate for the  Huzurabad by-election

ఓటుకు లక్ష ఇచ్చినా తీసుకోండని, దళిత బంధు, గిరిజన బంధు ఇవ్వమని మీ దగ్గరకు వస్తున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు డిమాండ్ చేయండని ఈటల రాజేందర్‌ అన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాతే మునుగోడు అభివృద్ధి, సంక్షేమం వచ్చిందని, ప్రచారానికి వస్తున్న బీజేపీ నేతలపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి అధికారులపై భవిష్యత్ లో కఠిన చర్యలు ఉంటాయి.. వారిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు ఈటల రాజేందర్‌.

Read more RELATED
Recommended to you

Latest news