చీకట్లో చంద్రబాబు మోడీ కాళ్లు, పవన్ మాయావతి కాళ్ళు పట్టుకోలేదా? అని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు జరగని విషయాన్ని జరిగినట్లు చిత్రీకరిస్తున్నాయి… కుడిపూడి చిట్టబ్బాయి వర్ధంతి సభకు సుబ్బారెడ్డి వస్తే నేను నమస్కారం చేశానన్నారు.
చిట్టబ్బాయి మరణించిన తర్వాత ఆ కుటుంబాన్ని వైఎస్ కుటుంబం ఆదుకుందని… అందుకే ఆ జాతి వాడిగా కృతగ్నత చూపించానని వెల్లడించారు. నా నమస్కారం సంస్కారం గా భావించాను.. కానీ మా సామాజిక వర్గంలో కొంత మందికి ఇది నచ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనల్ని ఆదుకున్న వాళ్ళను కృతగ్నత తెలపటం కూడా తప్పబడతారేమోనని… మాకు చీకటి రాజకీయాలు రావని పేర్కొన్నారు. రెండు టికెట్లు ఇవ్వమంటే చంద్రబాబు శెట్టి బలిజ లను ఎంత హేళనగా మాట్లాడాడో మర్చి పోయారా?? కొంత మంది శెట్టి బలిజలతో చంద్రబాబు ఆడిస్తున్న నాటకం ఇదని ఎద్దేవా చేశారు. జాతిని నమ్ముకుంటాను కానీ అమ్ముకోనని స్పష్టం చేశారు.