చెన్నై ఎయిర్ షో.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

-

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మరీనా బీచ్‌లో ఆదివారం జరిగిన ఎయిర్ షో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 92వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు దాదాపు 15 లక్షల మంది సందర్శకులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఎండ వేడి, ఉక్కపోత తాళలేక ఒక్కసారిగా ఇళ్లకు వెళ్లేందుకు లోకల్ రైల్వే‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. స్పాట్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

కాగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం చాన్స్ ఉందని సమాచారం.ఎండవేడి తాళలేక 265 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. వీరిలో 96 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విపరీతమైన ఎండ తీవ్రత కారణంగా ఇళ్లకు వెళ్లేందుకు లక్షల మంది ఒకేసారి రైల్వే స్టేషన్‌కు చేరుకోవడం వల్లే తొక్కిసలాట జరిగింది. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో సందర్శకులు రావడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోయారని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version