పర్ఫెక్ట్ బాడీ కొలతలతో ఎప్పుడు కుర్రకారు గుండెల్లో మంట పుట్టిస్తుంటుంది బాలీవుడ్ భామ దిశ పటాని. ఈ సుందరి..టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘లోఫర్’’ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తర్వాతే ఈ భామ బాలీవుడ్ వైపునకు తన అడుగులు వేసింది. ‘లోఫర్’ మూవీ లో ‘‘మౌని’’ క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది దిశా పటాని. ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ప్రతీ విషయాన్ని షేర్ చేస్తుంటుంది ఈ అమ్మడు.
తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఎరుపు రంగు పొట్టి డ్రెస్‌తో మత్తెక్కించే చూపులతో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘రెడ్ వైన్ లాగా మత్తెక్కిస్తున్నావ్ దిశా, రెడ్ ఫైర్’’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దిశా మోహిత్ సూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘‘ఏక్ విలన్ 2’’ సినిమాలో నటిస్తోంది.
View this post on Instagram