చినబాబు ‘యాత్ర’: సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

-

రాజకీయాల్లో పాదయాత్ర అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది…ప్రతి నాయకుడు ఇప్పుడు పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తున్నారు..అలాగే అధికారం దక్కించుకోవాలని అనుకుంటున్నారు. ఈ పాదయాత్ర ట్రెండ్ అనేది ఎప్పటినుంచో మొదలైన విషయం తెలిసిందే…పాదయాత్ర చేసిన వారు అధికారంలోకి రావడం ఖాయమనే సెంటిమెంట్ కూడా ఉంది. గతంలో వైఎస్సార్, తర్వాత చంద్రబాబు…నెక్స్ట్ జగన్ సైతం పాదయాత్ర చేసే అధికారంలోకి వచ్చి సీఎంలు అయ్యారు.

ఇలా పాదయాత్ర ద్వారా అధికారం దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు..అటు షర్మిల సైతం పాదయాత్ర చేస్తున్నారు…ఇక త్వరలోనే పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇటు ఏపీ విషయానికొస్తే…ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పాదయాత్ర చేస్తారని మొదట నుంచి ప్రచారం జరుగుతుంది…లేదా ఆయన బదులు నారా లోకేశ్ చేసే అవకాశం ఉందని ప్రచారం వచ్చింది. ఎందుకంటే చంద్రబాబుకు వయసు మీద పడటంతో పాదయాత్ర చేయడం అనేది కాస్త ఇబ్బంది అవుతుంది…అందుకే నారా లోకేశ్ ని రంగంలోకి దింపుతున్నారని తెలిసింది..ఇప్పటికే మహానాడుతో టీడీపీకి కొత్త ఊపు వచ్చింది..ఈ ఊపుని ఇలాగే కంటిన్యూ చేయడానికి నారా లోకేశ్..పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు టచ్ అయ్యేలా ఏడాదిపాటు సుదీర్ఘంగా యాత్ర నిర్వహించడానికి లోకేశ్ ప్రణాళిక రూపొందించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలోనే పాదయాత్ర మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే లోకేశ్ పాదయాత్ర టీడీపీని అధికారంలోకి తీసుకొస్తుందా? లేదా? అనేది చూడాలి…అసలు పాదయాత్ర సెంటిమెంట్ లోకేశ్ కు వర్కౌట్ అవుతుందో లేదో. ఎందుకంటే గతంలో జగన్ కోసం షర్మిల పాదయాత్ర చేశారు…కానీ ఆ యాత్ర పెద్దగా వర్కౌట్ కాలేదు..2014 ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాలేదు. ఇప్పుడు చంద్రబాబు కోసం చినబాబు యాత్రకు రెడీ అవుతున్నారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. మరి చూడాలి పాదయాత్ర సెంటిమెంట్ చినబాబుకు ఎలా వర్కౌట్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news