హైదరాబాద్ లో కలుషిత నీళ్లు వస్తున్నాయి..పరిష్కరించండి : ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే

-

హైదరాబాద్ నగరంలో కలుషిత నీళ్లు త్రాగి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని ఫైర్ ఆయారు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. ప్రభుత్వం కలుషిత నీటిని అరికట్టడం లేదని.. నిజాం కాలంలో వేసిన పైపులైన్ లే ఇప్పటికి ఉన్నాయని అగ్రహించారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలను విమర్శించిన కేసీఆర్… ఎనిమిదేళ్లు అయిన సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.

హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పాలని.. వర్షాకాలం సమీపిస్తున్న నాలాల్లో పూడిక తీయడం లేదని మండిపడ్డారు. శివారు ప్రాంతాల్లో తీవ్ర సమస్యలను వాటర్ బోర్డ్ గాలికొదిలేసిందని అగ్రహించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జలమండలి కి ఇస్తానన్న 500 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కలుషిత నీళ్లు కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. త్రాగు నీటికి,డ్రైనేజికి కొత్త పైపు లైన్ల వేయాలి.. పది రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే హైదరాబాద్ ను దిగ్బందిస్తామని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version