దిల్ రాజు పై చిరంజీవి, బాలయ్య బాబు ఫ్యాన్స్ గొడవ..!!

-

సంక్రాంతి పండుగ తెలుగు ప్రాంతాలలో భారీ ఎత్తున జరిగే పెద్ద పండుగ. అప్పుడు జనాలు కోళ్ల పందాలతో మంచి జోష్ లో వుంటారు. అప్పుడే మన హీరోల సినిమాలు కూడా పందెం కోళ్ళులా తలపడతాయి. అందుకే చాలా మంది షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మరియు బాలయ్య కూడా సంక్రాంతి బరిలో ఉన్నారు.

కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్  దశలో వుంది.ఈ సినిమాను  సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నారు. అలాగే  బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీర సింహ రెడ్డి సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. దీనితో  ఇప్పుడు బాలయ్య కూడా సంక్రాంతి బరిలో ఉన్నారు. ఇప్పుడు దిల్ రాజు కూడా తమిళంలో విజయ్ తో సినిమా తీస్తూ దాన్ని వారసుడుగా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్ర లలో ఎక్కువ సినిమా థియేటర్స్ దిల్ రాజు చేతిలో వున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు తన డబ్బింగ్ సినిమా కోసం చాలా థియేటర్స్ ను తన చేతిలో వుంచుకుంటున్నాడు అని చిరు మరియు బాలయ్య ఫ్యాన్స్ మండి పడుతున్నారు. తెలుగు లో చిరంజీవి, బాలకృష్ణ కు వున్న మార్కెట్ లో 10% లేని విజయ్ సినిమా కు అన్ని థియేటర్స్ లాక్ చేయాలని చూడడం ప్యాన్స్ కు మండేలా చేస్తుంది. గోల వుంటే ఏదో కొన్ని పిచ్చి థియేటర్స్ దిల్ రాజు ఇచ్చే అవకాశం ఉందట. దీనిపై రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే జరిగేలా వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version