విశాఖ గత రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులపై మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలు తోకలేని కోతులని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ గర్జన జరిగే సమయంలో పవన్ నగరానికి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు మంత్రి కారుమూరి. కార్యక్రమాన్ని ముందే నిర్ణయించినప్పటికీ గొడవలు జరిగే అవకాశం ఉందని తెలిసినప్పుడు వాయిదా వేసుకుని ఉండాల్సిందని మంత్రి కారుమూరి అన్నారు. జనసేన కార్యకర్తలకు తోక ఒకటే తక్కువన్న ఆయన.. ఈ తోకలేని కోతులు పవన్‌నే వాహనం నుంచి కింద పడేశాయని మంత్రి కారుమూరి అన్నారు. విశాఖ విమానాశ్రయం వద్ద కర్రలు, రాడ్లతో దుర్మార్గంగా దాడిచేశారని అన్నారు మంత్రి కారుమూరి.
వారి దాడిలో మంత్రి రోజా తలపగిలి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కారుమూరి. ఇదిలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో చేసిన హడావుడిని పెద్ద డ్రామాగా అభివర్ణించారు మాజీ మంత్రి పేర్నినాని. కేవలం చంద్రబాబు ప్రయోజనల కోసమే పవన్ విశాఖ టూర్ లో హడవుడి చేశారంటూ మండిపడ్డారు. విశాఖ గర్జనను పక్కదారి పట్టించడానికే చంద్రబాబు తరుపున పవన్ విశాఖ వెళ్లరాని విమర్శించారు. సినిమా షూటింగ్ లో విరామంలో చంద్రబాబు ఇచ్చిన ఫ్యాకేజీకి న్యాయం చేశారన్నారు. పవన్ కు కావాల్సింది కేవలం చంద్రబాబు ప్రయోజనాలే తప్ప ప్రజల ప్రయోజనలు పట్టవని, విలువలు, నిబద్ధత లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడా? లేక లేక ముఠా నాయకుడా? అంటూ మండిపడ్డాడు. విశాఖ నుండి కదలని అని చెప్పి మళ్లీ ఎందుకు వెళ్లిపోయరని విమర్శించారు. షెడ్యూల్ ప్రకారం విశాఖకు వచ్చి వెళ్లిపోయారన్నారు.