సీఐడీ డీజీ గోవింద్ సింగ్ కారుకు ప్ర‌మాదం.. ఆయ‌న భార్య‌ మృతి

-

తెలంగాణ రాష్ట్ర సీఐడీ డీజీ గోవింద్ సింగ్ భార్య ప్రమాదానికి గురై మృతి చెందారు. విషయంలోకి వెళ్ళితే.. సోమ‌వారం ఉద‌యం 9:10 గంట‌ల‌కు గోవింద్ సింగ్, ఆయ‌న స‌తీమ‌ణి క‌లిసి 191 బెటాలియ‌న్ నుంచి రాజ‌స్థాన్‌లోని త‌నోత్ మాతా ఆల‌యానికి వెళ్లారు. ద‌ర్శ‌నం అనంత‌రం రాంగ‌ఢ్‌కు తిరిగి వ‌స్తుండ‌గా, వారి కారు మ‌ధ్యాహ్నం 2:45 గంట‌ల‌కు ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో గోవింద్ సింగ్ తీవ్రంగా గాయ‌ప‌డ‌గా, ఆయ‌న భార్య మృతి చెందారు.

సీఐడీ డీజీ గోవింద్ సింగ్ కారుకు ప్ర‌మాదం.. ఆయ‌న భార్య‌ మృతి

కారు డ్రైవ‌ర్ కూడా తీవ్ర గాయాల‌పాల‌య్యారు. గోవింద్ సింగ్, డ్రైవ‌ర్‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. అయితే గోవింద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. సీఐడీ డీజీ గోవింద్ సింగ్ కారు రాజ‌స్థాన్‌లో ప్ర‌మాదానికి గురైంది. సీఐడీ డీజీ గోవింద్ సింగ్ భార్య మృతి ప‌ట్ల డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న స‌హ‌చ‌ర సీనియ‌ర్ అధికారి గోవింద్ సింగ్ త్వ‌రిత‌గ‌తిన కోలుకోవాల‌ని డీజీపీ ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news