నిరుద్యోగులకు సిఎం జగన్ శుభవార్త చెప్పారు. వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. మే నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని సీఎంకు తెలిపారు అధికారులు.
మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలు పూర్తిచేయాలన్న సీఎం జగన్.. ఇందులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించడానికి పెద్ద సంఖ్యలో డాక్టర్లను నియమిస్తున్నామని.. వైద్యులకు ఇచ్చే జీతాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదని స్పష్టం చేశారు.
ప్రజలకు తప్పకుండా వైద్యుల సేవలు అందుబాటులో ఉండేందుకు గతంలో జీతాలు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆమేరకు వారికి జీతాలు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అందుకనే ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించామని వెల్లడించారు. అలాగే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.