Breaking : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వచ్చే మార్చి 31కి పూర్తి కావాలి..

-

నగరాల్లో పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు అంశాలపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో టిడ్కో ఇళ్లు, అర్భన్ క్లినిక్స్‌, జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ తదితర అంశాల పురోగతిపైనా సమీక్షలో చర్చించారు. వర్షాల నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించి పనులు మొదలు పెట్టాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. మార్చి 31 కల్లా అన్ని రోడ్లనూ మళ్లీ బాగుచేయాలని సూచించారు సీఎం జగన్‌.

Andhra CM Jagan likely to expand cabinet on June 8 | The News Minute

గార్బేజ్‌ స్టేషన్ల కారణంగా పరిసరాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏమాత్రం ఉండకూడదని తెలిపారు సీఎం జగన్‌. ప్రతి మున్సిపాలిటీలోనూ వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ పర్యవేక్షించాలని ఆదేశించారు. మున్సిపాల్టీల వారీగా చెత్త, మురుగునీటి శుద్ధి చేసే ప్రక్రియలో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలు, అదనపు వనరులపై నివేదిక రూపొందించాలని సీఎం జగన్​ చెప్పారు. కృష్ణానది రిటైనింగ్‌ వాల్‌ వద్ద మురుగునీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రిటైనింగ్‌ వాల్‌ బండ్‌ను చెట్లు, విద్యుత్‌ దీపాలు, ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దాలన్నారు. ప్లాస్టిక్‌ ప్లెక్సీల నిషేధం అమలుకు సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలన్నారు సీఎం జగన్‌. ప్లాస్టిక్‌ నుంచి క్లాత్‌ బ్యానర్లు వైపు మళ్లడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు. జగనన్న కాలనీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు సీఎం జగన్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news