Breaking : విశాఖకు చేరుకున్న సీఎం జగన్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్

-

నేడు, రేపు ప్రధాని మోడీ విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ విశాఖలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు తూర్పుతీర నగరానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ విశాఖ చేరుకున్నారు. కాగా, విశాఖలోని మారుతి జంక్షన్ లో ప్రధాని మోదీ ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షో కోసం బీజేపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ఈ రాత్రి పవన్ కంటే ముందే ఏపీ బీజేపీ నేతలు ప్రధాని మోదీని కలవనున్నారు. రాత్రి 8.30 గంటలకు పవన్.. మోదీతో సమావేశం అవుతారు. విశాఖలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభలో ఎనిమిది మందికే అనుమతించారు.

Vishwa Bhushan : ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌కు కరోనా పాజిటివ్..  ఆరోగ్యపరిస్థితిపై సీఎం జగన్ ఆరా - 10TV Telugu

ప్రధానితో పాటు వేదికపై గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, బీజేపీ ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, పీవీఎన్ మాధవ్ మాత్రమే ఉంటారు. ఈ సభలో ప్రధాని మోదీ 40 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. ఈ సభలో ప్రసంగించేందుకు ఏపీ సీఎం జగన్ కు 7 నిమిషాల సమయం కేటాయించారు. ఈ బహిరంగ సభకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news