తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును అసెంబ్లీకి రమ్మనండని ఏపీ సీఎం జగన్.. టీడీపీ సభ్యులను కోరారు. ఇవాళ బీఏసీ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. మీరు ఏ అంశం కావాలన్న చర్చకు మేం రెడీ.. సభలో చర్చకు సహకరిస్తారా..లేదా అని అచ్చెన్నాయుడును ఉద్దేశించిన పేర్కొన్నారు.
మీరు కోరే ప్రతి అంశం పైన చర్చిస్తామని.. అవసరమైతే ఈఎస్ఐ స్కామ్ పై కూడా చర్చిద్దాం అని అచ్చెన్నాయుడుకు పంచ్ విసిరారు. రాజధాని కావాలంటే..అది కూడా పెడతామన్నారు. కుటుంబ సభ్యులపై విమర్శలు, పార్టీ కార్యాలయంపై దాడులు వంటి అంశాలపై చర్చ వద్దని పేర్కొన్నారు. సభలో అనవసరంగా గందరగోళం సృష్టించడం ఏంటంటూ అచ్చెన్నను ప్రశ్నించిన సీఎం జగన్… ఏ అంశం మీదనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అలాగే.. మీ అధినేత చంద్రబాబును అన్ని పక్కకు పెట్టి.. అసెంబ్లీకి రమ్మని చెప్పండంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.