ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వార్డ్ సచివాలయ వ్యవస్థ ఎంతలా సక్సెస్ అయిందో తెలిసిందే. తాజాగా సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న వివిధ ఉద్యోగులను బదిలీ చేసే ప్రక్రియకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ బదిలీ ప్రక్రియను జూన్ 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖలలో పనిచేస్తున్న ఈ ఉద్యోగులలో దివ్యాంగులు, మానసిక వైకల్యం కల్గిన పిల్లల తల్లితండ్రులకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని నిర్దారించింది. ఇందుకోసం జూన్ 15 వరకు జిల్లా మరియు అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశాన్ని ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వం.
ఇక వీరు కాకుండా మిగిలిన వారు ఎవరైనా బదిలీ కోసం అప్లై చేసుకుని ఉంటే వారి అప్లికేషన్ లను తర్వాత పరిశీలించాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.