ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలకు సరే అన్నారు. ఇందు మేరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. చాలా కాలం నుండి ఇది పెండింగ్ లోనే ఉండిపోయింది. దీనితో ఆయా ఉద్యోగస్తులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.
వాళ్లందరికీ కూడా ఇప్పుడు ఉపశమనం లభంచనుంది. ఎప్పటి నుండో చాలా మంది ఎదురు చూస్తున్న ఫలితం లేదు. కానీ ఇప్పడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలకు ఒప్పుకున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే ఆంధ్రాకు 1338 మంది.. ఏపీ నుంచి తెలంగాణకు 1804 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆమోదం ఇవ్వడం కోసం జాబితాను పంపనున్నారు.
ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ని ఉపాధ్యాయ బదిలీల్లో తప్పని సరిగా ఎనిమిదేళ్ల సర్వీస్‌ను పరిగణన లోకి తీసుకోవాలని చెప్పింది. అలానే ఏపీ గవర్నమెంట్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ని తెలంగాణ బదిలీ కోరుకునే వారందరికీ ఇవ్వనుంది. ఆమోదం తెలిపిన సీఎంకు ఉద్యోగులు థాంక్స్ చెప్పారు.