నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో ఆసక్తికర చర్చ చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగం సమయంలో టీడీపీ నినాదాలు.. గత అసెంబ్లీలో చంద్రబాబు టార్గెట్టుగా జరిగిన పరిణామాల ప్రస్తావన వర్చింది. బీఏసీ సమావేశానికి రాగానే అచ్చెన్న కమింగ్ బ్యాక్ అంటూ చమత్కరించారు సీఎం జగన్. కమింగ్ బ్యాక్ ఏముందని.. అసెంబ్లీ ఉంటే రావాలి కదా అని రిప్లై ఇచ్చాడు అచ్చెన్న.
రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నరును అవమానించేలా టీడీపీ సభ్యులు వ్యవహరించారని…చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదని.. గవర్నర్ వయస్సు కూడా గౌరవం ఇవ్వలేదంటూ సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ పవిత్రతను నాశనం చేసేలా టీడీపీ సభ్యుల ప్రవర్తన ఉందంటూ సీఎం జగన్ మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ ప్రసంగానికి అభ్యంతరం తెలపడం ప్రతిపక్షాలు చేస్తూనే ఉంటాయంటూ సమాధానమిచ్చారు అచ్చెన్న. గవర్నర్ ప్రసంగానికి అభ్యంతరం తెలపడం ఇదే మొదటిసారి కాదన్నారు అచ్చెన్న.
నేనెప్పుడూ ఈ విధంగా చేయలేదని.. నిరూపిస్తే రాజీనామా చేస్తామంటూ జగన్ ఛాలెంజ్ చేశారు. గతంలో సభ్యల సంఖ్య ప్రకారం టైమ్ అలాట్మెంట్ చేయడం మొదలు పెట్టింది టీడీపీనే కదా అంటూ గుర్తు చేసిన సీఎం జగన్…. సభలో టీడీపీ సభ్యులు అబద్దాలు మాట్లాడుతున్నారంటూ తీవ్ర అభ్యంతరం చేశారు. అబద్దాలు మాట్లాడితే ఆటోమేటిక్కుగా మైక్ కట్ చేస్తామన్న సీఎం జగన్… గత సమావేశంలో చంద్రబాబును తామెవరం ఏమీ అనకున్నా.. బయటకెళ్లి తామెదో అన్నట్టుగా చిత్రీకరించారని ఫైర్ అయ్యారు.