Breaking : రేపు నెల్లూరులో పర్యటించనున్న సీఎం జగన్‌

-

రేపు నెల్లూరు జిల్లాలో సీఎ జగన్‌ పర్యటించనున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. 10.40 గంటలకు రామాయపట్నం చేరుకోనున్నారు. ఉదయం 11 గంటల నుంచి రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నెల్లూరు నుంచి తిరుగుప్రయాణమవుతారు సీఎం జగన్‌. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ సిహెచ్ విజయరావు, కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి.. మొండివారిపాలెంలో జరుగనున్న బహిరంగ సభ, హెలిప్యాడ్, శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు.

Andhra Pradesh CM Jagan Mohan Reddy elected lifetime president of YSR  Congress Party - India News

అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ శంకుస్థాపన అనంతరం సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. పోర్టు కోసం భూములిచ్చిన రైతులకు పునరావాస చర్యల్లో భాగంగా సీఎం జగన్ పట్టాలు పంపిణీ చేయనున్నారని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని, పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఓడరేవు ఆధారిత పరిశ్రమలకు కొత్త మార్గాలను తెరవడంతో పాటుగా.. ఈ ప్రాంతంలోని పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కలెక్టర్.

 

Read more RELATED
Recommended to you

Latest news