దేవుడి దయ, చల్లని దీవెనలు నా ప్రభుత్వం ఉండాలి – సీఎం జగన్

-

దేవుడి దయ, చల్లని దీవెనలు నా ప్రభుత్వం ఉండాలని ఏపీ సీఎం జగన్ ట్వీట్‌ చేశారు. చీకటి నుంచి వెలుగులోకి ఏ మనిషినైనా నడిపించేది చదువు అని… మనిషి తలరాతనుగానీ, కుటుంబం తలరాతనుగానీ మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని వివరించారు సీఎం జగన్‌. అలాంటి చదువుకు పేదరికం అడ్డుకాకూడదని పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఇస్తున్నామన్నారు.

cm jagan

ఈ రోజు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9.86 లక్షలమంది విద్యార్థులకు మేలుచేస్తూ రూ.698.68 కోట్లను ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో తల్లుల ఖాతాల్లో జమచేస్తున్నానన్నారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు నా ప్రభుత్వంపై ఉండాలని కోరుకుంటున్నానని జగన్‌ ట్వీట్‌ చేశారు. మంచి చదువు, మంచి వైద్యం, మంచి ఆరోగ్యం, రైతుల్లో సంతోషం, నా అక్క చెల్లెమ్మల్లో సాధికారిత, జోరైన పారిశ్రామికాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా మరోసారి సంక్షేమ-అభివృద్ధి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. అసమానతలు తగ్గించి, పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఈ బడ్జెట్‌ద్వారా మరో అడుగు ముందుకేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version