ఎవడో గాలిగాడు గత్తరగాడు వచ్చి ఏదో చెప్పింది వింటే ఆగమైతరు.. తస్మాత్‌ జాగ్రత్త : సీఎం కేసీఆర్

-

తెలంగాణలో రాజకీయ రోజు రోజుకు వేడెక్కుతోంది. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్న వేళ.. రాష్ట్ర రాజకీయం అక్కడ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నేడు టీఆర్‌ఎస్‌ మునుగోడు ప్రజాదీవెన పేరిట బహిరంగ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఇవాళ ఒక్క వ్యక్తి గెలవడం ముఖ్యం కాదని, ఈ ఎన్నికతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రాదన్నారు సీఎం కేసీఆర్‌. టీఆర్ఎస్ బలంగానే ఉందని, కానీ తెలంగాణ ఏమంటోంది? వాళ్లు ఎలా స్పందిస్తున్నారు? అనే వార్త మునుగోడు నుంచి ఢిల్లీ వెళ్లాలన్నారు సీఎం కేసీఆర్‌. కాబట్టి బొమ్మలు చూసో, గారడీ విద్యలు చూసో మోసపోయామంటే గోస పడతామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. కాబట్టి దయచేసి మోసపోకుండా.. మా అక్కచెల్లెళ్లు, తల్లులు కేసీఆర్ చెప్పిన ముచ్చట నిజమా కాదా? అని చర్చించాలన్నారు. ఉన్న పెన్షన్లు, ఉన్న వసతులు, ఉన్న కరెంటు ఊడగొట్టుకుందామా? ఆలోచన చేయాలన్నారు సీఎం కేసీఆర్‌. చివరకు చేనేత కార్మికుల మీద కూడా జీఎస్టీ విధించారని, చస్తే స్మశానం మీద జీఎస్టీ, పిల్లలు తాగే పాల మీద జీఎస్టీ ఇంత అన్యాయమా? ఈ డబ్బంతా ఏమవుతోంది? దొంగలకు, దోపిడీదారులకు బ్యాంకులను లక్షల కోట్లకు ముంచేవాళ్లకు ఎన్పీయే పేర్ల మీద పది పది లక్షల కోట్లు మాఫీ చేసి పేద ప్రజల పొట్ట కొట్టే ప్రయత్నం జరుగుతోంది.

New revenue act will be enforced soon: CM KCR

మునుగోడు రైతులు ఓటేసే ముందు మన బోరు కాడకు పోయి.. బోరుకు దండం పెట్టి పోవాలె అన్నారు సీఎం కేసీఆర్‌. అక్కచెల్లెళ్లు ఓటు వేసే సమయంలో గ్యాస్ సిలిండర్‌కు దణ్ణం పెట్టి పొయ్యి ఓటెయ్యాల. మనం కత్తి ఒకడికిచ్చి యుద్ధం మరొకడిని చెయ్యాలని చెప్పకూడదు. ఎవరి చేతిలో కత్తి పెడితే కరెక్టో వాడి చేతిలోనే కత్తి పెట్టాలన్నారు సీఎం కేసీఆర్‌. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధ పోవాలంటే తెలంగాణ రావాలని చెప్పా.. ఇవాళ పోయిందా లేదా? మన కరెంట్ కడుపునిండా రావాలంటే తెలంగాణ వస్తేనే జరుగుతుందని చెప్పా.. ఇవ్వాళ 24 గంటలు కరెంటు వస్తుందా లేదా? ఆలోచించండి. ఎవడో గాలిగాడు గత్తరగాడు వచ్చి ఏదో చెప్తే.. వాడి వెనుక గొర్రెదాటుగా పోతే గోల్‌మాల్ అయిపోతాం. బతుకులు ఆగమైతయ్ అన్నారు సీఎం కేసీఆర్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news