ఈ మతోన్మాదులను తరిమికొట్టకపోతే ఈ దేశం బాగుపడదు : సీఎం కేసీఆర్‌

-

మునుగోడు ఉప ఎన్నిక నవంబరు 3న జరగనుండగా, టీఆర్ఎస్ పార్టీ నేడు చండూరులో రణభేరి సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు విచ్చేసిన సీఎం కేసీఆర్ ప్రధానంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నిన్న మొన్న మీరు టీవీలో చూసింది కొంతే… చూడాల్సింది చాలానే ఉంది. ఢిల్లీ పీఠమే కదిలిపోయే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో అన్నీ బయటపడతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దుర్మార్గులను కూకటివేళ్లతో సహా పెకలించి బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప భారతదేశానికి నిష్కృతి లేదన్నారు సీఎం కేసీఆర్. ఈ మతోన్మాదులను, ఈ పెట్టుబడిదారుల తొత్తులను తరిమికొట్టకపోతే ఈ దేశం బాగుపడదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మునుగోడులో బీజేపీని గెలిపిస్తే అరాచకాలకు అంతే ఉండదు… ఆ తర్వాత మేం చేసేది ఏమీ ఉండదు అని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.. ఈ అరాచకాలను మోదీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? రెండు సార్లు ప్రధాని అయిన మోదీకి ఇంకా ఏంకావాలి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. మునుగోడు ప్రజలు నవంబరు 3వరకు అప్రమత్తంగా ఉండి, బ్రహ్మాండంగా ఈ చైతన్యాన్ని ఇలాగే కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version