తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం జాతి కులం మతం అనే బేధం లేకుండా 58 ఏండ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామన్నారు. ఒక రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు సమస్యలు సంభవిస్తాయని, కానీ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కులు ఇవ్వకుండా.. బీజేపీ ప్రభుత్వం విద్వేష, విభజన రాజకీయాలు చేస్తుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు.
మాకు వచ్చే న్యాయమైన హక్కు అడుగుతున్నామని, ఈ దేశంలో 8 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఏ వర్గం ప్రజలకైనా మంచి పని చేసిందా? మనం కూడా ఈ దేశంలో భాగమే కదా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఎందుకు హక్కులు ఇవ్వడం లేదని, అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారన్నారు సీఎం కేసీఆర్. పేదల ప్రజల ఉసురు పోసుకుంటున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ప్రజల ఆస్తులను ఉచితంగా కార్పొరేట్లకు దోచి పెడుతున్నారన్న సీఎం కేసీఆర్.. సంకుచితమైన పెడధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. అనేక కష్టాలు, నష్టాలకొర్చి, ప్రాణాలు కోల్పోయి తెచ్చుకున్న తెలంగాణ మరో కల్లోల్లానికి గురి కావొద్దు. అందరూ ఐకమత్యంంగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్.