RRRలో కొమురం భీంలా సీఎం కేసీఆర్..వీడియో వైరల్

-

దసరా రోజునే జాతీయ పార్టీపై తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ నెల 5 న అంటే రేపు కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని.. ఆ కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీకి అక్టోబర్ 6 న ప్రతినిధుల బృందం వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది.

అయితే… కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటించనుండటంతో TRS వర్గాల్లో నూతన ఉత్సాహం ఏర్పడింది. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కెసిఆర్ పై ఓ స్పెషల్ సాంగ్ చేయించారు. RRR సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రను పరిచయం చేసే టీజర్ ఆడియో కు కేసిఆర్ వీడియో ఎడిట్ చేశారు . ‘గొండు బెబ్బులి- కేసిఆర్!!’ అని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఈ వీడియోను ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియానే షేక్‌ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news