పోడు రైతులకూ రైతు బంధు, ఉచిత కరెంట్ – సీఎం కేసీఆర్ ప్రకటన

-

పోడు భూములు పంపిణీ చేసి..వారికి కూడా రైతు బంధు కూడా ఇస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్‌. పోడు భూములపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూములు గిరిజనుల హక్కు కాదు… అటవీ సంపద కపాడాలనా వద్దా..? అని ప్రశ్నించారు.

అడవులు ఎవరి వల్ల నాశనం అయ్యాయి… అడవుల పునరుజ్జీవన ప్రక్రియ పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోడు భూములపై మాకు చిత్త శుద్ది వుందని.. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచన అని వెల్లడించారు.

దాదాపు 66లక్షల ఎకరాలు ఉన్నాయని.. అన్ని స్టేజి లో సర్వేలు జరిగాయన్నారు. ఇప్పటికిప్పుడు పోడు భూముల పంపిణీ చేయమమని.. అడవులు నరకం అని మాకు హామీ ఇస్తేనే ప్రభుత్వం పోడు భూములు ఇస్తామని చెప్పారు. అడవులు కొట్టేసి మాకు ఇవ్వమంటే హక్కు కాదని… అయినా గిరిజనుల శ్రేయస్సు కోరి అన్ని ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 11లక్షల ఎకరాలు పంపిణీ చేస్తామని..అఖిల పక్ష సమావేశం తర్వాత భూముల పంపిణీ చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version