రాజకీయ పార్టీల నేతలకు సిగ్గు, శరం లేదు : కెసిఆర్ ఫైర్

-

సిద్దిపేట జిల్లాలో పర్యటించిన సిఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి ఫలాలు ప్రతి గడపకు అందాలనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని.. రాష్ట్రంలో నాలుగు వెటర్నరీ కళాశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 1969 లో సిద్దిపేట గడ్డమీద తెలంగాణ నినాదం మొదలైందని.. కాకతీయుల నాటి గొలుసు కుట్టు చెరువులు సమైక్య రాష్ట్రంలో ధ్వంసం చేశారని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటుకు నాలుగు నెలల ముందుగానే స్వప్నించి మిషన్ కాకతీయ పేరు పెట్టామన్నారు. దేశానికి ధాన్యాగారమైన పంజాబ్ ను అధిగమించామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల టన్నుల‌ ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు ఉండేవి…నేడు 25 లక్షలకు పెంచామని వెల్లడించారు.

చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని.. తాగునీటికి, విద్యుత్ కు కొరత లేదన్నారు. కొన్ని రాజకీయ పార్టీల నేతలకు సిగ్గు, శరం లేదని.. ఇప్పటి వరకు వ్యవసాయంపై సరైన లెక్కలు లేవని ఫైర్ అయ్యారు. అధికారులకు నన్ను చూస్తూనే భయం పట్టుకుందని.. ప్రతి ఐదు వేల మందిని క్లష్టర్ గా రైతు వేదిక నిర్మించామన్నారు. కాళేశ్వరం కడితే కొన్ని కుక్కలు మొరిగాయని.. మల్లన్న సాగర్ అయిపోతే నెత్తి మీద కుండ ఉన్నట్లేనని తెలిపారు. నేను బయలు దేరిన నాడు తెలంగాణ వస్తుందని ఎవరు నమ్మలేదని.. 100 శాతం బంగారు తెలంగాణ అయి తీరుతుందని స్పష్టం చేశారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ప్రాజెక్ట్ పేరు దేవుడు పేరు పెట్టామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news