సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. కాసేపట్లో హస్తినకు బయలుదేరి వెళ్లనున్నట్లు ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రెండు, మూడు రోజులు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నట్లు అందులో పేర్కొన్నారు అధికారులు. జాతీయ రాజకీయాలపై విపక్షాలతో చర్చించేందుకు కేసీఆర్ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఫలితాలు వెలువడిన అనంతరం కేసీఆర్ ఢిల్లీ వెళ్తుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరనున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు, మరికొందరు మంత్రులు ఉండనున్నారు. అయితే.. కాగా.. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలో పర్యటించిన సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సైతం సమావేశమై.. బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు పలు వ్యూహాలు రచించారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో పాలిటిక్స్ మరింత వేడెక్కాయి.