మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలు దూకుడు పెంచాయి. నవంబర్ 1న సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ చండూరులో సీఎం కేసీఆర్ సభ జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు చండూరులో జరిగే కెసిఆర్ బహిరంగ సభపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
కెసిఆర్ నేటి బహిరంగ సభలో ఏడుస్తూ నటిస్తారట. మళ్లీ సెంటిమెంట్ రగిలించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కెసిఆర్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. అలాగే మునుగోడులో రెండు రోజులపాటు బిజెపి భారీ ర్యాలీ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ ర్యాలీతో కేసీఆర్ దిమ్మతిరుగుతుందని చెప్పారు. సభకు వస్తున్న సీఎం మునుగోడు అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మునుగోడులో ఎగిరేది బిజెపి జెండా నే అని అన్నారు.