కలర్ సైకాలజీ అనేది చాలామందికి తెలియని విషయం. మీకు నచ్చే రంగుని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు. మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. అలా ఒక్కో రంగు గురించి తెలుసుకుందాం.
నలుపు
నలుపు రంగు ఇష్టపడేవారు, లేదా తమ డ్రెస్ లో నలుపు రంగు కాంబినేషన్ తప్పనిసరిగా ఉండాలనుకునేవారు ఒత్తిడితో బాధపడుతుంటారు. ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు. దీనికి పూర్తి వ్యతిరేకంగా బలంగా, స్వతంత్రంగా కూడా ఉంటారు. కొత్త కొత్త వాటిని కనుక్కోవాలనే తపన వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. చాలామటుకు వీరి గురించి ఎక్కువ మందికి తెలియకూడదని అనుకుంటారు.
తెలుపు
తెలుపు రంగును ఇష్టపడేవారు సున్నిత మనస్కులై, అమాయకత్వంతో కూడుకుని ఉంటారు. ఇంకా క్రమశిక్షణతో ఉంటారు. తమ పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు. ఎక్కడకి వెళ్ళినా ఆ శ్రద్ధ కనిపిస్తుంటుంది.
ఎరుపు
సైన్స్ ఆధారంగా ఎరుపు రంగు అపాయాన్ని సూచిస్తే, సైకాలజీ పరంగా ఎరుపు రంగు సాహసాన్ని, ప్రేరణను, చలాకీగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. చాలామంది తమ పెయింటింగ్స్ లో భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ఎరుపు రంగును ఉపయోగించినప్పటికీ ప్రేమికుల రోజున ప్రేమను ప్రకటించేది ఎరుపు రంగుతోనే అని గుర్తుంచుకోవాలి.
గులాబీ
చాలామంది గులాబీ రంగు ఆడవాళ్ళకి సంబంధించినది మాత్రమే అనుకుంటారు. గులాబీ రంగు ప్రేమని సూచిస్తుంది. మీరు గులాబీ రంగుని ఇష్టపడితే గనక చాలా రొమాంటిక్ అయి ఉంటారు. లేదా ప్రేమలో పడవేసే వాళ్ళయి ఉంటారు.
నారింజ రంగు
నారింజ రంగు ఇష్టపడేవారు డైనమిక్ పర్సనాలిటీ కలిగి ఉంటారు. జీవితం పట్ల ఉత్సాహం, కుతూహలం ఎక్కువగా ఉంటుంది.
నీలం
నీలిరంగుని ఇష్టపడేవారు తాము బ్రతుకుతూ అవతలి వారు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అవతలి వారికి భద్రతని ఇవ్వడంలో ముందుంటారు.