కేంద్ర ప్రభుత్వం పై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు.గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ ను గుజరాత్ లోని జామ్ నగర్ కు తరలించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో దానిని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ ను ఉటంకిస్తూ ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు..ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను తెలంగాణకు కేటాయించడంలో కేంద్రం వివక్ష చూపిస్తోంది అంటూ మండిపడ్డారు.” ప్రతిష్టాత్మక విద్యా సంస్థను రాష్ట్రానికి తెచ్చినందుకు కంగ్రాట్స్ ఎన్డీఏ ప్రభుత్వం లోని మంత్రి కిషన్ రెడ్డి గారు..ఓ..కాస్త ఆగండి..ఎప్పటిలాగే గుజరాత్ కు ప్రధాని.దానిని జామ్ నగర్ కు తరలించేందుకు నిర్ణయం చేశారు.తెలంగాణపై ప్రధానిి మోదీ వివక్ష కొనసాగుతూనే ఉంది”.
అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.దాంతో పాటు కేంద్ర ప్రభుత్వ వివక్షను అక్షర రూపంలో ట్విట్టర్ లో పెట్టారు.దేశవ్యాప్తంగా కేంద్రం..7. ఐఐఎమ్ లు 7. ఐఐటీ లు 2. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 16 ఐఐటి లు 4 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్,157 వైద్య కళాశాలలు, 84 నవోదయ విద్యాలయాలు కేటాయించిన ఒక్కటి తెలంగాణకు ఇవ్వలేదని కేటీఆర్ పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామని హామీ ఇచ్చిన ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు.
Congratulations to Kishan Reddy Ji, Cabinet Minister in NPA Govt on bringing a prestigious national institute to the state 👏
Oh wait!! As usual, the PM of Gujarat decided that it should move to Jamnagar
The saga of Modi Ji’s discrimination against Telangana goes on unabated👇 pic.twitter.com/Du1mMzXjJE
— KTR (@KTRTRS) April 20, 2022