ఎజెండాకు లోబడే మాట్లాడండి.. ఓపిక పట్టండి : రేవంత్‌ రెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత యుద్ధం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ‘హాత్ సే హాత్ జోడో’ సన్నాహక సమావేశంలో గందరగోళం ఏర్పడింది. సమావేశానికి వచ్చిన పలువురు పార్టీ నాయకులకు సర్ది చెప్పేందుకు రేవంత్ యత్నించారు. ‘‘ గొడవలు వద్దు.. సమావేశానికి సంబంధించినవి కాకుండా ఇతర విషయాలు వద్దు. ఎజెండాకు లోబడే మాట్లాడండి.. ఓపిక పట్టండి’’ అని సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎవరి మనుసును గాయపర్చవద్దు. ఐక్యంగా ముందుకు పోవాలి. రాహుల్ గాంధీ ని చూసి నేర్చుకోండి . భారత్ జోడో యాత్రలో రాహుల్ మాట్లాడుతున్న విధానం చూడండి.

Revanth Reddy days as PCC chief numbered?

ఆయన పార్టీ ఏందీ, ఈయన పార్టీ ఏందీ అని అనొద్దు . పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యం . కలిసి ఉండడానికి పనిచేయండి . కొత్తగా నియామకమైన వాళ్ళు.. అందరిని కలుపుకొని పనిచేయాలి’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ‘‘ మేము ఈరోజు పార్టీ పదవులకు రాజీనామా చేసినం. పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి పనిచేస్తాం . మాకు పార్టీ పదవులు అవసరం లేదు. నేను రాజస్థాన్ లో రాహుల్ తో కలిసి నడిచిన. పార్టీ నేతలను మానసికంగా దెబ్బతీయొద్దని.. నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని రాహుల్ ఆనాడు చెప్పారు. కానీ కొందరు పార్టీ నేతలు మీడియా ముందు మాట్లాడి పరువు తీస్తున్నారు. రాహుల్ నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారు’’ అని కామెంట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news