Breaking : కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం వాయిదా

-

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు జరగాల్సిన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం వాయిదా పడింది. గాంధీభవన్‌లో సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన ఈ సమావేశం సీనియర్ల వ్యతిరేకతతో వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. పీసీసీ కార్యక్రమాల్లో పాల్గొనబోమని ఇప్పటికే 9 మంది తిరుగుబాటు నేతలు ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు ఈ నెల 20న మహేశ్వర్ రెడ్డి నివాసంలో ఆ నేతలు భేటీ కానున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవలి పీసీసీ కమిటీల కూర్పు నేపథ్యంలో పార్టీలోని అంతర్గత విబేధాలు మరోసారి బయటపడ్డాయి. కొత్తగా ఏర్పాటైన పీసీసీ కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కకపోవడంపై సీనియర్లు రేవంత్‌పై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఈ అంశంపై మల్లు భట్టివిక్రమార్క ఇంట్లో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు శనివారం భేటీ అయ్యారు. కొత్త కమిటీల్లో వలసవాదులకు పెద్దపీట వేయడంపై గుర్రుగా ఉన్నారు సీనియర్లు. 50 శాతానికిపైగా పదవులు టీడీపీ నుంచి వలస వచ్చిన వారికే ఇచ్చారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వారికి పదవులు ఇచ్చారని, ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారం కాబోతుందని అభిప్రాయపడుతున్నారు. ఇకపై నేతలంతా కలిసి ‘సేవ్ కాంగ్రెస్’ పేరిట పని చేయాలని నిర్ణయించారు. తక్షణమే సేవ్ కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ కోసమే పని చేస్తున్న నేతలకు కమిటీల్లో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news