అలవిగాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది : ఈటెల రాజేందర్

-

మోదీ గారి మీద విమర్శలు చేయడమంటే సూర్యుని మీద ఉమ్మి వేయడమే అని ప్రతిపక్ష పార్టీ నాయకులపై మండిపడ్డారు ఈటెల రాజేందర్.ఎల్బి స్టేడియంలో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ప్రజాక్షేత్రంలోకి పోయే దమ్ము లేక బిజెపి రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని దుర్గార్థమైన ప్రచారాన్ని ఎత్తుకున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటెల. అమిత్ షా మాట్లాడిన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. అలవిగాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదు అన్నారు. ఆరు గ్యారెంటీలు 66 హామీలు 420 పనులు చేస్తామని చెప్పి ఒక ఫ్రీ బస్సు తప్ప ఏమీ ఇవ్వకుండా మోసం చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి.

కరెంటు కోతలు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లతో మళ్ళీ పాత కాంగ్రెస్ పార్టీ పాలనను గుర్తుచేస్తుంది. ఆరు నెలలు గడిచిన..తెలంగాణ ఆడబిడ్డలకు 2500 భృతి రాలేదు. కల్యాణ లక్ష్మికి లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇవ్వలేదు.కాలేజీ అమ్మాయికి స్కూటీ రాలేదు. నాలుగు వేల రూపాయల పెన్షన్ అందడం లేదు. వికలాంగులకి 6 పెన్షన్ ఊసే లేదు. ఒక్క రూపాయి ఖర్చు లేని రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వందల కోట్ల రూపాయల ఖర్చుపెట్టి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ లలో అబద్ధపు కథనాలు ప్రచారం చేస్తున్నారు.

పేదల కోసం పనిచేసే పార్టీ ఒక బిజెపి మాత్రమే. అణగారిన వర్గాలకు సముచిత ప్రాధాన్యత.. రాజ్యాధికారంలో అవకాశం ఇవ్వాలని తపనపడే పార్టీ బిజెపి. బిజెపి పాలిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా రిజర్వేషన్లు పోలేదు. గిరిజనుల మంత్రిత్వ శాఖను స్థాపించి న్యాయం చేస్తున్న పార్టీ బిజెపి. మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మొదట దళిత బిడ్డను రాష్ట్రపతి చేశారు. రెండోసారి గిరిజన ఆదివాసి అడవి బిడ్డను రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి మాత్రమే దక్కింది అని ఈటెల రాజేందర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version