పీవీని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు: హరీశ్ రావు

-

మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.కాంగ్రెస్ ప్ర‌భుత్వం పీవీని ప‌ట్టించుకోలేదు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం పీవీ ఘాట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీలో పీవీ చిత్ర‌ప‌టంఏర్పాటు చేశాం అని గుర్తు చేశారు. పీవీ కుమార్తె సుర‌భి వాణిదేవీకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాం అని అన్నారు.

ఈ రోజు గొప్పదినం అని పీవీ నరసింహారావు కి భార‌త‌ర‌త్న అవార్డు రావడం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం అని అన్నారు. పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏక‌గ్రీవ తీర్మానం చేసి పంపిస్తే….కేంద్రం వారికి భార‌త‌ర‌త్న ఇచ్చినందుకు ఈ స‌భ‌లో కేంద్రానికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలి అని పేర్కొన్నారు. మ‌న పీవీ గౌర‌వాన్ని పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version