కరోనా మొదటి వేవ్ సృష్టించిన భీభత్సాన్ని అల్లాడిపోయిన జనం, రెండవ వేవ్ కి పూర్తిగా చతికిలపడిపోయారు. ఎంతో మంది కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఎంతో నష్టపోయారు. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతూనే ఉన్నాయి. కానీ ఒక్క రాష్ట్రంలో మాత్రం కరోనా కరాళ నృత్యం చేస్తుంది. కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
దేశంలోని మొత్తం కేసుల్లో యాభై శాతానికి పైగా కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు నుండి నైట్ కర్ఫ్యూ మొదలు కానుండి. రాత్రి 10గంటల నుండి ఉదయం 6గంటల వరకు ఈ కర్ఫ్యూ ఉండనుంది. కేసులు పెరుగుతున్న కారణంగా కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు ఎన్ని రోజులు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.