రాజ‌కీయాల్లోనే ఉన్నా.. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తా : జేడీ లక్ష్మీ నారాయ‌ణ ప్ర‌క‌ట‌న

-

తాను ఇంకా రాజ‌కీయాల్లోనే ఉన్నాన‌ని మాజీ జేడీ లక్ష్మీ నారాయ‌ణ అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ కూడా చేస్తాన‌ని మాజీ జేడీ లక్ష్మీ నారాయ‌ణ ప్ర‌క‌టించారు. కాగ ఈ రోజు జేడీ లక్ష్మీ నారాయ‌ణ.. హైద‌రాబాద్ లో ప‌లువురు కాపు నాయ‌కుల‌తో స‌మావేశం అయ్యారు. అధికారం పార్టీల వద్ద కాద‌ని.. ప్ర‌జ‌ల వ‌ద్ద ఉండాల‌ని ఆయ‌న అన్నారు. అందు కోసం తాను పోరాటం చేస్తాన‌ని తెలిపారు. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు కాపుల‌ను రాజ‌కీయ లబ్దీ కోస‌మే వాడుకున్నార‌ని ఆరోపించారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు పై కూడా జేడీ లక్ష్మీ నారాయ‌ణ స్పందించారు. కొత్త‌ జిల్లాల‌ను ఏర్పాటు చేయ‌డం స‌రైన నిర్ణ‌యం అని అన్నారు.

కొత్త జిల్లాల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు పాల‌న ద‌గ్గ‌ర అవుతుంద‌ని అన్నారు. తెలంగాణలో నూ జిల్లాల విభ‌జ‌న జ‌రిగింద‌ని గుర్తు చేశారు. అలాగే ప్ర‌భుత్వం తీసుకునే ప్ర‌తి అంశాన్ని మౌఖికంగా కాకుండా.. ఫైలింగ్ చేయాల‌ని అన్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల సులువుగా ఉంటుంద‌ని తెలిపారు. లేక పోతే… అధికారులు కోర్టుల‌కు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని అన్నారు.

కాగ జేడీ లక్ష్మీ నారాయ‌ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలో జేడీ లక్ష్మీ నారాయ‌ణ జన‌సేన పార్టీలో ఉండేవారు. అయితే ఇటీవ‌ల ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే జేడీ లక్ష్మీ నారాయ‌ణ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version