తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతునే ఉంది. కేసుల సంఖ్య కాస్త తగ్గినా.. కరోనా ఉధృతి తగ్గినట్టు లేదు. ఒక్క రోజు కేసుల సంఖ్య తగ్గినా.. తర్వాత రోజు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. కాగ గురువారంతో పోలిస్తే.. రాష్ట్రంలో స్వల్పంగా కరోనా కేసులు తగ్గాయి. ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ఆధారంగా ఈ ఒక్క రోజే.. 3,877 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకు 7,54,976 కేసులు నమోదు అయ్యాయి.
అలాగే గడిచిన 24 గంటలలో ఇద్దరు కరోనా కాటుకు బలైయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,083 మరణాలు సంభవించాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 2,981 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగ రాష్ట్రంలో ప్రస్తుతం 40,414 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 1,01,812 శాంపిల్స్ ను టెస్టు చేశారు. కాగ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినా.. వ్యాప్తి మాత్రం తగ్గలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు తెలిపారు. ప్రజలు అందరూ కూడా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.