కరోనా వ్యాక్సినేషన్: దేశంలో 75 శాతం మందికి రెండు డోసుల టీకా పూర్తి

-

కరోనా పోరులో దేశం మరో మైలురాయిని చేరింది. ఇటీవల వ్యాక్సినేషన్ ప్రారంభమై ఏడాది పూర్తయింది. తాజాగా దేశంలో టీకాకు అర్హత పొందిన ప్రజల్లో 75 శాతం మంది రెండు డోసుల కరోనా టీకాను తీసుకున్నారు. దీంతో ఏడాది కాలంలోనే ఈ ఘనత సాధించింది ఇండియా. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. మొదట్లో టీకాపై అనుమానాలు వ్యక్తం చేసిన ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పించడంతో టీకా కార్యక్రమం ఊపందుకుంది. గతేడాది జనవరి 16న ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడం మొదలైంది. మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. ఎప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికి టీకాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏడాది జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటి వరకు 165 కోట్ల టీకా డోసులను ప్రజలకు ఇచ్చారు. దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ఉచితం ప్రభుత్వ ప్రజలకు అందించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news