దేశంలో స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు… కొత్తగా 2685 కేసులు

-

దేశంలో కరోనా తీవ్రత పూర్తిగా సద్దుమణగలేదు. రోజుకు మూడు వేల కన్నా తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచంలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. ఇండియాలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే దేశంలో కొత్తగా 2685 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 33 మంది వైరస్ బారి పడి మరణించగా… 2158 మంది కోరోనా మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. 

దేశంలో గత కొన్ని రోజులతో పోలిస్తే వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,50,262 కాగా… మరణించిన వారు 5,24,572..కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,26,09,335గా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 16,308గా ఉంది. దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్క రోజు 14,39,466 మందికి టీకాలు వేశారు. దేశంలో ఇప్పటి వరకు 193,13,41,918 డోసులను అర్హులైన వారికి ఇచ్చారు. మరోవైపు ప్రపంచంలో ఒక్క రోజు  5 లక్షల కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో ఒక్క రోజే 90 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news