అబ్బాయికి కరోనా పాజిటివ్.. పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుపడ్డంతో !

-

కల్యాణం వచ్చినా, కక్కు వచ్చినా ఆపలేమంటారు, అలానే కరోనా వైరస్ కోకూడా మధ్యప్రదేశ్ లోని రత్లాం నగరంలో ఒక జంట పెళ్లిని ఆపలేకపోయింది.  వరుడికి కరోనా సోకడంతో ఆ వివాహానికి దంపతులు మరియు కొద్ది మంది అతిథులు పీపీఈ కిట్లు ధరించి, అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరిస్తూ పెళ్లి తంతు కానిచ్చారు. అందుతున్న నివేదికల ప్రకారం, వరుడు పెళ్ళికి ముందు COVID-19 పాజిటివ్ అని తేలింది.

అయినప్పటికీ అతని కుటుంబ సభ్యులు ప్రణాళికలను మార్చమని బలవంతం చేయలేదు. ఈ వేడుకలో వరుడు, అతని వధువు మరియు అతిథులు అందరూ పీపీఈ కిట్లు ధరించారు. ఈ జంట మరియు పూజారి కూడా పీపీఈ కిట్లలో అన్ని ఆచారాలను పూర్తి చేశారు. ఈ పెళ్లి గురించి మాట్లాడిన రత్లం తహశీల్దార్ నవీన్ గార్గ్, “వరుడికి ఏప్రిల్ 19 న పాజిటివ్ వచ్చింది, ముందు మేము పెళ్లి ఆపడానికి ఇక్కడకు వచ్చాము, కానీ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వివాహం ఘనంగా జరిగింది.” అని చెప్పుకొచ్చారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version