కోవిడ్ వ్యాక్సినేషన్ లో మరో రికార్డ్… 160 కోట్ల మార్క్ ను దాటిన వ్యాక్సిన్ డోసులు

-

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ మరో రికార్డ్ నమోదుచేసింది. ప్రపంచంలోనే  అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ గా భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. తాజాగా ఈరోజు దేశంలో వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 160 కోట్ల మార్క్ ను దాటింది. ఈ విషయాన్ని కేంద్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ మన్సుఖ్ మండవీయ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇప్పటికే దేశంలో 95 కోట్లకు పైగా తొలిడోస్ ఇవ్వగా…65 కోట్ల రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.

గతేడాది జనవరి 16న ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడం మొదలైంది. మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. ఎప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికి టీకాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈనెల 3 నుంచి 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. త్వరలోనే 12-14 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version