కోవిడ్ ప్రమాదం ముగిసిపోయిందనుకోవద్దు – కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ

-

కోవిడ్ -19 ప్రమాదం ముగిసిపోయిందని అనుకోవద్దని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ. గురువారం ఢిల్లీలో రాష్ట్రాలు, యూటీల ఆరోగ్య మంత్రులతో సమావేశం నిర్వహించారు.  దేశంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం, వ్యాధి వ్యాప్తి గురించి చర్చించారు. కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గడపగడపకు తీసుకెళ్లేందుకు హర్ ఘర్ దస్తక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి అనుగుణంగా రాష్ట్రాలు, యూటీలు వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను వేగవంతం చేయాలని కోరారు. భారతదేశంలోని వయోజన జనాభాలో 79.2 శాతం మంది కనీసం ఒక డోస్ కోవిడ్ వ్యాక్సిన్‌ని పొందారని, దేశంలోని 94 కోట్ల వయోజన జనాభాలో 37 శాతానికి పైగా రెండు డోొసుల వ్యాక్సిన్ అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 110.23 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి 1,20,08,58,170 వ్యాక్సిన్‌ డోస్‌లను ఉచితంగా అందించిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్ అత్యధిక డోసులు అందించిన మొదటి ఐదు రాష్ట్రాలుగా ఉన్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version