కుష్టి రోగి కంటేపెద్ద రోగి.. విలసవంతమైన బిక్షగత్తె : కంగనాపై సీపీఐ నారాయణ కామెంట్

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. పై సీపీఐ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంగనా రనౌత్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెద్ద నటి అని.. తాను అద్భుతంగా నటిస్తుందని పొగిడిన నారాయణ… అదే స్థాయిలో చురకలు కూడా అందించారు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా విలాసవంతమైన బిచ్చగత్తె అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నారాయణ. కుష్టి రోగి కంటే పెద్ద రోగిష్టి అంటూ ఫైర్ అయ్యారు.

కంగనా రనౌత్ కు బిజెపి పార్టీ పద్మ శ్రీ అవార్డు భిక్షగా ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు. అంత గొప్ప అవార్డు అందుకున్న కంగనా రనౌత్ కు… ఇండియాకు స్వసంత్రం ఎప్పుడు వచ్చిందో తెలియదంటూ చురకలంటించారు నారాయణ. కంగనా కు అవార్డు ఇచ్చిన బిజెపి పార్టీకి కూడా భారత దేశ స్వతంత్రం గురించి అస్సలు తెలియదా అంటూ మండిపడ్డారు. బిజెపి పార్టీ ని పొగిడిన వారికి ఏ దేశంలో… మంచి స్థానం ఉంటుందని పేర్కొన్నారు.  కాగా..” 1947 సంవత్సరం లో ఇండియా కు దక్కింది భిక్ష మాత్రమే. నిజమైన స్వాతంత్రం 2014లో వచ్చింది” అంటూ మోడీ ప్రధాని అవటాన్ని ఉద్దేశిస్తూ కంగనా తాజాగా కామెంట్ చేసింది. అయితే దీనికి తాజాగా కౌంటర్ ఇచ్చారు సీపీఐ నారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version